జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వెంకీ చేసిన నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈసినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ తదితరులు
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్
డైరెక్టర్ : జీతూ జోసెఫ్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్
కథ..
దృశ్యం సినిమా చూసిన వాళ్లకు కథ గుర్తుండే ఉంటుంది కదా. రాంబాబు (వెంకటేష్) తన కూతురు చేసిన హత్య నుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది చూపించారు. మొదటి పార్ట్ లోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ వాటికి తగ్గట్టుగా రాంబాబు వేసే ఎత్తులు చూపిస్తారు. ఫైనల్ గా కేసు క్లోజ్ అవుతుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో కెబుల్ బిజినెస్ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్ ఓనర్ అవుతాడు. అంతేకాదు సినిమా చేయడానికి కూడా రెడీ అవుతాడు. ఇక రాంబాబు ఫ్యామిలీ అన్నీ మరిచిపోయి హ్యాపీగా ఉన్న టైమ్ లో దాదాపు ఆరేళ్ల తరువాత మళ్లీ కేసును రీ ఓపెన్ చేస్తారు. దీంతో మళ్లీ రాంబాబు కుటుంబానికి సమస్యలు ఎదురవుతాయి. వారి కుటుంబంపై పోలీసుల నిఘా ఉంటుంది. మరి పోలీసులు వేసిన ఎత్తులు ఏంటి? రాం బాబు వేసిన పై ఎత్తులు ఏంటి? అసలు శవం పోలీసులకు దొరికిందా? చివరకు రాం బాబు ఏం చేశాడు? సినిమా తీయాలని అంత పట్టు ఎందుకు పట్టాడు? దానికి ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? చివరకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటన్నదే దృశ్యం 2 సినిమా కథ.
ఇక ఈసినిమా మలయాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కాబట్టి మలయాళంలో చూసిన వాళ్లకు ముందే ట్విస్ట్ లు తెలిసిపోయే అవకాశం ఉంది. ఆ సినిమాను చూడని వాళ్లకు అయితే మంచి థ్రిల్లింగ్ ఇచ్చే సినిమా అవుతుంది. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిందే ట్విస్ట్ లు. ఈసినిమాకు అవి కావాల్సినన్ని ఉన్నాయి కాబట్టి ఈసినిమా అందరికీ నచ్చేస్తుంది. నిజానికి సీక్వెల్ అనగానే మొదటి పార్ట్ కంటే సీక్వెల్ పైనే ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వడం అంత ఈజీకాదు. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ ను మించి సీక్వెల్ ను తీశాడంటే మెచ్చుకోక తప్పదు. ఈ సినిమాకు తను రాసుకున్న కథ, ఇంత గ్రిప్పింగ్‌గా రాసుకున్న కథనమే బలం.
మరి రాంబాబు పాత్రలో చేసిన వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. తన నటనే ఈసినిమాకు బలం. నిజాన్ని తనలోనే మోస్తూ బాధపడే తీరు, పోలీసుల అంచనాలకు మించి వేసే ఎత్తులతో రాంబాబు అందరినీ ఆకట్టుకుంటాడు. తెలివిగా పోలీసులను బురిడి కొట్టించాడు.. అతను వేసే ఎత్తులు థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఇక రాంబాబు భార్యగా మీనా అలాగే వారి పిల్లలుగా అంజు (కృతిక) అను( ఏస్తర్ అనిల్) వారు కూడా బాగా నటించారు. అలాగే ఫస్ట్ పార్ట్ లో నదియా, నరేష్ పాత్రలు కూడా ఉన్నాయి. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేష్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. కొడుకుని పొగొట్టుకొని వారు పడే మనో వేదనను చూపించే పాత్రలో ఒదిగిపోయారు. అయితే ఈసినిమాలో సంపత్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఐజీపీగా పాత్రలో నటించిన సంపత్ రాజ్ కూడా చాలా బాగా నటించాడు. కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాకేంతిక విభాగానికి వస్తే నిజానికి ఇలాంటి సినిమాకు పాటలు అంటేనే డిస్టర్బ్ అవుతారు. అవి లేకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశానికి తగ్గట్టు ఉంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
ఓవరాల్ గా చెప్పాలంటే దృశ్యం కంటే దృశ్యం 2 అంతకు మించి అని చెప్పొచ్చు. ఒక సూపర్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం దృశ్యం2 చూసి ఎంజాయ్ చేయోచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: