యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య నిఖిల్ సినిమాలు ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఇంతకుముందు ఒక సినిమా తరువాత ఒక సినిమా చేశాననీ, ఈ సారి మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు.. అంతేకాదు నాలుగు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టమంటే ఏం చెబుతాం .. ఇది కూడా అంతే అంటూ చమత్కరించాడు. ఈ సినిమాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Working on 4 Movies Simultaneously…
Never did this before.
Always worked only 1 at a time till now.. but this is like 4 kids who r all my favourites but don’t know whom to give max priority to.
Giving my best and praying tht all 4 of them get the best release and Success 🙏🏼🥰 pic.twitter.com/7FdZGsOEbb— Nikhil Siddhartha (@actor_Nikhil) October 25, 2021
కాగా ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇంకా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎడిటర్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు సుదీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి స్వామి రారా, కేశవ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.