కరోనా వల్ల ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే చాలా కష్టంగా ఉంటే యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో అలరించిన సందీప్ కిషన్ ఇటీవల గల్లీ రౌడీతో సందడి చేశాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి రానుంది. నవంబర్ 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సందీప్ కిషన్ సరసన నేహాశెట్టి నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, బాబీ సింహ, హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఏవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు.
ఇక ప్రస్తుతం సందీప్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో సూపర్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈసినిమాకు బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి సూపర్ న్యాచురల్ ఫాంటసీ జోనర్‌లో కొత్త కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: