సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ విషయాన్ని పోస్టర్ తో ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ చేసేశారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఈ సినిమాకు చిత్రబృందం యూఏ సర్టిఫికేట్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శివ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈసినిమాకు ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి గతంలో అజిత్‌తో వీరమ్, విశ్వాసం లాంటి సినిమాలను కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసే హిట్స్ కొట్టాడు శివ. ఇప్పుడు కూడా అలాంటి నేపథ్యంతోనే వస్తున్నారు. మరి పెద్దన్నగా రజినీకాంత్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: