సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ వయసులో యూ ట్యూబ్ ఛానల్ ను మెయింటైన్ చేస్తుందంటేనే చెప్పొచ్చు ఎంత టాలెంటెడో. ఇక సితార కు సంబంధించిన ఫొటోలు కానీ వీడియోలు కానీ మహేష్, నమ్రత సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇక సితారకు సంబంధించిన వీడియో ఏదైన బయటకు వచ్చిందంటే అది నిమిషాల్లో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సితార ఎంట్రీ గురించి ఎప్పుడూ పెద్దగా వార్తలు వచ్చింది లేదు. ఇక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌ని.. సితార కు సినిమాలు చేసే ఆసక్తి ఉందా? అని ప్రశ్నించారు.దానికి మహేష్.. తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఇంగ్లీష్ సినిమాలు చేయాలని ఉంది. తను తెలుగులో ఫ్రోజెన్ కు డబ్బింగ్ చెప్పింది.. తెలుగులో అలాంటి పాత్రలు వస్తే ఏమన్నా చేస్తుందేమో
వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్నే వాళ్ళకే వదిలిపెట్టాము అని తెలిపాడు.
కాగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది పూర్తయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆతరువాత రాజమౌళితో సినిమాను పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: