రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం ఓటిటి డీల్ 

aavesham has fetched 35cr as OTT deal

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్ లో నటించిన ఆవేశం రీసెంట్ గా విడుదలై సూపర్ థియేట్రికల్ రన్ ను సొంతం చేసుకుంది.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150కోట్ల వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది.ఇప్పటికీ కేరళలో డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.ఇక ఈసినిమా ఓటిటి రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎర్లీ స్ట్రీమింగ్ కోసం అమెజాన్ ప్రైమ్ దాదాపు 35కోట్లకు డీల్ కుదుర్చుకుందని టాక్.మలయాళంలో ఇంతవరకు ఏ సినిమాకు కూడా ఇంత భారీ డీల్ జరుగలేదు దాంతో ఓటిటి రైట్స్ విషయంలో అత్యధిక ధర పలికిన సినిమాగా ఆవేశం రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఈసినిమా ఈ రోజు రాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లోకి రానుందని సమాచారం.అయితే స్ట్రీమింగ్ గురించి ప్రైమ్ వీడియో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

జీతూ మాధవన్ డైరెక్ట్ చేసిన ఆశిష్ విద్యార్ధి ,మన్సూర్ అలీ ఖాన్ ,పూజా మోహన్ రాజా ,సాజిన్ గోపు కీలక పాత్రల్లో కనిపించారు.సుషిన్ శ్యామ్ సంగీతం అందించగా ఫహాద్ ఫాజిల్ సతీమణి ప్రముఖ హీరోయిన్ నజ్రియా,అన్వర్ రషీద్ ఈసినిమాను నిర్మించారు. ఇక పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు ఫహద్ ఫాజిల్.ఇప్పుడు పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడు.ఇందులో అల్లు అర్జున్ ,ఫహద్ ఫాజిల్ హోరాహోరీగా తలపడనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 13 =