డార్లింగ్- నభా షూటింగ్ కంప్లీట్

Nabha Natesh Wraps Up Her Shoot For Darling Movie

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అంతేకాదు ఈసినిమాను ప్రకటించకముందు నభానటేష్, ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరిగింది. అయితే సినిమాను ప్రకటించిన తరువాత ప్రమోషన్ భాగంగా ఇలా చేశారని క్లారిటీ వచ్చేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చింది నభా నటేష్. ఈసినిమాలో తన షూటింగ్ కంప్లీట్ అయిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మరి అప్పుడే నభా తన షూటింగ్ ను పూర్తిచేసిందంటే ఈసినిమాను అఫీషియల్ గా ప్రకటించకముందే షూటింగ్ ను మొదలుపెట్టారన్న విషయం అయితే అర్థమవుతుంది.

కాగా ఇంకా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =