డబుల్ ఇస్మార్ట్ నుండి సర్ ప్రైజ్ రానుంది

Double Ismart Teaser Loading

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,ఉస్తాద్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా డబుల్ ఇస్మార్ట్.ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.నిజానికి ఈపాటికే థియేటర్లలోకి రావాల్సిన ఈసినిమా అనివార్యకారణాల వల్ల మధ్యలో షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో వెనక్కివెళ్లాల్సి వచ్చింది.ఇక ఈసినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.రెండు రోజుల క్రితమే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ముంబై లో ఈషూటింగ్ జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే ఈసినిమా నుండి రామ్ బర్త్ డే రోజు మే 15న అప్డేట్ రానుంది.అదేంటంటే డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను విడుదలచేయనున్నారని సమాచారం.టీజర్ కట్ కూడా జరిగిపోయిందని ఇక ఈ టీజర్ అదిరిపోనుందని ఇన్సైడ్ టాక్. రామ్ ఫ్యాన్స్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూరి మార్క్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈసినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి వుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా మణిశర్మ  సంగీతం అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఆడియో చార్ట్ బాస్టర్ కావడం తో డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ పై భారీ అంచానాలు వున్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్,ఛార్మి నిర్మిస్తున్న ఈసినిమా ఆగస్టు లో థియేటర్లోకి వచ్చే ఛాన్స్ వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =