సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో మేకర్స్ ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియా తో సమావేశమయ్యారు. వెబ్ సిరీస్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెబ్ సిరీస్ లను చూడడానికి ఇష్టపడతాననీ , వెబ్ సిరీస్ లలో నటించడానికి ఎప్పుడూ ఆలోచించలేదనీ , ఫ్యూచర్ లో నటించే అవకాశం ఉండచ్చునేమో ఎవరికి తెలుసు అని మహేష్ బాబు అన్నారు. “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ 70 శాతం కంప్లీట్ అయ్యిందని తెలిపారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న “#SSMB 28 “మూవీ నవంబర్ లో ప్రారంభం కానుంది.
[subscribe]
![Video thumbnail](https://img.youtube.com/vi/a6qd_TeFBgs/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/YZoPiFwzADI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/RDjH12NNrYg/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/hmb1uogndeM/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)