టాలీవుడ్ డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్డీఏ) అధికారికంగా ప్రకటించింది. కాగా శనివారం దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇక దాసరి గారి 151 సినిమా సందర్భంగా 151 మంది దర్శకులకు సన్మానం జరిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మరియు ప్రముఖ దర్శకులు పలువురు పాల్గొన్నారు. వీరిలో అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, వశిష్ట మల్లిడి, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాగా కళాతపస్వి కె విశ్వనాథ్ గారు దాసరి గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరపాలని సూచించారని వీరశంకర్ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్లు ఈరోజు జరగాల్సిన కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని తెలిపారు. ఇక ఈ వేడుకను ఈ నెల 19వ తేదీన న సాయంత్రం 6 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఈవెంట్ ను సక్సెస్ చేయడం కోసం యంగ్ డైరెక్టర్స్ అందరూ శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఈవెంట్ డేట్ పోస్టర్ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: