సందీప్ కిషన్ హీరోగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘గల్లీ రౌడీ’. ఇక ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు మెగాస్టార్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనుండా.. ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ ను లాంచ్ చేయనున్న ‘స్టేట్ రౌడీ’ అంటూ పోస్టర్ ను కూడా వదిలారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
MEGASTAR 🔥😍❤️
September 11th 5.04 pm 🤟🏽#GullyRowdyOnSept17th#MasalaEntertainer @actorsimha #NehaShetty @Ram_Miriyala @iamsaikartheek #GNageswaraReddy @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp pic.twitter.com/xzt3VD4LaV
— Sundeep Kishan (@sundeepkishan) September 9, 2021
కాగా కాగా ఈసినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తుండగా… చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: