హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . కేబుల్ బ్రిడ్జి-ఐకియా రూట్‌లో ప్రమాదం జరిగింది. సాయిధరమ్ నడుపుతున్న స్సోర్ట్స్ బైక్ స్కిడ్ అయి జారీ పడింది. వేగంగా వస్తుండడంతో ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను మెడికవర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెడికవర్ ఆస్పత్రికి సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆస్పత్రికి పవన్‌కల్యాణ్, వైష్ణవ్‌తేజ్, వరుణ్‌తేజ్, నిహారిక చేరుకున్నారు. హీరో సందీప్ కిషన్‌తో పాటు మరికొందరు ఆస్పత్రికి వచ్చారు. మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్‌తేజ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చిరంజీవి, సురేఖ చేరుకున్నారు. సాయి తేజ్ పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.సాయిధర్‌మ్ తేజ్‌కు ప్రాణాపాయం లేదనీ , ఎటువంటి ఆందోళన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందనీ , వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామనీ , 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామనీ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: