కన్నడ , తెలుగు , తమిళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక “మిషన్ మజ్ను ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శంతన్ బాగ్చి దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా , రష్మిక జంటగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “మిషన్‌మజ్ను” మూవీ షూటింగ్ ను రష్మిక కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ “మిషన్ మజ్ను”మూవీ తో హిందీ భాష, సంస్కృతుల గురించి తెలుసుకున్నాననీ , బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అక్కడి పనితీరుపై అవగాహన వచ్చిందనీ , ఉత్తరాది రాష్ట్రాలను సందర్శించాలనే తన కల నెరవేరిందనీ , సినిమా కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా అంగీకరించాననీ , ఇలాంటి అరుదైన పాత్రలు ఒక్కసారి చేజారితే మళ్లీ చేసే అవకాశం రాదని అనిపించిందనీ , నటనపరంగా కొత్తగా పునరావిష్కరించుకునే ఛాన్స్ లభించిందనీ , సినిమా షూటింగ్ పూర్తయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాననీ , జీవితకాలం మర్చిపోలేని జ్ఞాపకాల్ని ఈ చిత్రం మిగిల్చిందనీ , మంచి టీమ్‌తో కలిసి పని చేశాననీ , ‘ఐ లవ్ మిషన్ మజ్ను’ టీమ్ అనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: