పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కే హంగామా చేసే అభిమానులు బర్త్ డే (SEP 2 వ తేదీ )సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. “వకీల్ సాబ్” చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ “భీమ్లా నాయక్”మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు . ఈ మూవీ తో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న”హరిహర వీరమల్లు” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీస్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ 4 సినిమాల సంబంధించి అప్‌డేట్స్ రిలీజ్ కానున్నాయి. “భీమ్లా నాయక్”మూవీ ఫస్ట్ సింగిల్ 11:16AM కు , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి 1:20 PM కు అప్ డేట్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించి 2:20 PM కు అప్ డేట్ , హరీష్ శంకర్ మూవీ అప్‌డేట్ 4.05PM కు రిలీజ్ కానున్నాయి. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మూవీస్ అప్ డేట్స్ రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: