పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నేడు పవన్ పుట్టినరోజు రానే వచ్చింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ నాయకుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. “చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్ @PawanKalyan
అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. pic.twitter.com/PWAbNmvpAu— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021
ఇక ఇదిలాఉండగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుండి వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు మేకర్స్. నాలుగు సినిమాల నుండి ఆయన అప్ప్ డేట్స్ రానున్నాయి.
ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. వీటితో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డితో సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవి కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: