సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కీర్తి సురేష్ కథానాయిక . ఈ మూవీ తరువాత మహేష్ బాబు హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “#SSMB 28″మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఒక కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక కాగా మరో కీలక పాత్రలో నభా నటేష్ ఎంపిక అయ్యారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ , బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “అంధాధున్”తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ యువ హీరోలతో నటించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ నభా నటేష్ స్టార్ హీరో మహేష్ బాబు తో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆమె అదృష్టం గా చెప్పుకోవాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: