లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించినప్పటి నుండే ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు అప్పుడే రిలీజ్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాను 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. మరి భారీ బడ్జెట్ సినిమా అందులోనూ శంకర్ సినిమా కాబట్టి షూటింగ్ కు తక్కువ టైమ్ తీసుకున్నా గ్రాఫిక్స్, విజువల్స్ అంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ ఉంటుంది. మరి అలాంటిది అంత తొందరగా ఈసినిమా రిలీజ్ చేస్తారంటే కాస్త డౌటే. అయితే కలిసొచ్చే అంశం ఏంటంటే ఈసినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉండటం. దిల్ రాజు మరీ లేట్ అవ్వకుండా సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయిస్తాడు. మరి షూటింగ్ కు ఎలాంటి బ్రేక్ లు లేకపోతే అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయోచ్చు చూద్దాం ఏం జరుగుతుందో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్ఫణలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తుంది. ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ లో కార్తీక్ సుబ్బారాజు హెల్ప్ కూడా శంకర్ తీసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: