సక్సెస్ ఫుల్ “విక్రమ్ “(1986) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున మూడున్నర దశాబ్దాలుగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “అన్నమయ్య “, శ్రీరామదాసు “, “షిర్డీ సాయి “, “జగద్గురు ఆది శంకర “వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 100సినిమాలకు పైగా హీరోగా నటించిన నాగార్జున బెస్ట్ యాక్టర్ గా 9నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. వయసు మీద పడుతున్నా నాగార్జున యంగ్ గా కనపడుతూ , యాక్టివ్ గా మూవీస్ లో నటించడం విశేషం. ఆగష్టు 29 వ తేదీ నాగ్గార్జున తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యుల , సినీ ప్రముఖుల , అభిమానుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. ,నాగార్జునకు మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు చెప్పారు. ప్రతీ క్షణం ఎంతో ప్రశాంతంగా ఉండే మనిషనీ , హద్దులు లేకుండా నటనలో తరచూ ప్రయోగాలు చేస్తుంటారనీ , అంతకంటే మించి ఎంతోకాలంగా తనకు ఎప్పటికీ ప్రియమైన మిత్రుడు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: