వైవిద్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. తమిళ్ లోనే కాదు తన సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శరవణన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలజ్ చేశారు చిత్రయూనిట్. విశాల్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ ఫస్ట్ లుక్ అందరినీ అకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: