స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో రామ్ చరణ్ అతిధిగా పాల్గొన్నారు. “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ లో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పి రామ్ చరణ్ సినిమా పట్ల క్రేజ్‌ను రెట్టింపు చేశారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యపరిచే అంశాలున్నాయనీ , స్క్రీన్ పై తారక్‌ని చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందేననీ చెప్పారు. కొమురం భీమ్ పాత్రలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందనీ, ఆ సినిమా షూట్‌లో మనం ఎంతో కష్టపడ్డామనీ , అల్లూరిగా, కొమురంగా మనం నటించామంటే నిజంగా పూర్వజన్మ సుకృతం అంటూ తారక్ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీవితంలో కొన్ని బంధాల గురించి ఎంత మాట్లాడిన అది తక్కువే అవుతుందనీ , కొందరితో ఉన్న అనుబంధం, ఆత్మీయతను బయట పెట్టకపోవడమే మంచిదని తన అభిప్రాయమనీ , తనకు పవన్ కళ్యాణ్ బాబాయ్‌కి మధ్య ఉన్న అనుబంధం గురించి అంత సింపుల్‌గా చెప్పలేననీ , నాన్న(చిరంజీవి ) షూటింగ్స్‌లో బిజీగా ఉంటే అమ్మ కూడా ఆయనతోపాటు లొకేషన్‌కి వెళ్లేదనీ , దాంతో బాబాయే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేవారనీ , సరిగ్గా చదువుకోకపోతే మందలించేవారనీ ,తాను పెద్దయ్యాక నాన్న తనతో డైరెక్ట్‌గా చెప్పలేని ఎన్నో విషయాలను బాబాయ్ ద్వారా తనకు తెలిపేవారనీ , తనకు పవన్ కళ్యాణ్ బాబాయ్ మాత్రమే కాదు. ఒక అన్న లెక్క అంటూ రామ్ చరణ్ చెప్పారు. నాన్నతో స్క్రీన్ పంచుకున్న “ఆచార్య” చిత్రం తనకే కాదు తన కుటుంబం మొత్తానికీ ఎంతో ప్రత్యేకమనీ , జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయమిదనీ , ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన డైరెక్టర్ కొరటాల శివకు కృతజ్ఞతలని రామ్ చరణ్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: