హీరో రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీలో పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఇస్మార్ట్ శంకర్ “మూవీ హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO 19 ” మూవీ చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో రామ్ పై దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మలయాళ , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కథానాయికగా ప్రేక్షకులను అలరించిన నదియా సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. “అత్తరింటికి దారేది “, “దృశ్యం “, “అ ఆ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం “గని” “వరుడు కావలెను” చిత్రాల్లో నటిస్తున్న నదియా ఇటీవలే “దృశ్యం 2” షూటింగ్ పూర్తి చేశారు. సీనియర్ హీరోయిన్ నదియా ఇప్పుడు హీరో రామ్ తో పాటు “#RAPO 19 ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: