కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి దాదాపు 3 నెలల పాటు చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. జూలై నెలలో పవన్ కళ్యాణ్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” తెలుగు రీమేక్ మూవీ, విజయ్ దేవరకొండ “లైగర్ ” తప్ప లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన మూవీస్ అన్నీ పునః ప్రారంభం అయ్యాయి. పలు మూవీ షూటింగ్స్ తో టాలీవుడ్ కళ కళ లాడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న “అఖండ “, పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట “, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “, శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “RT 68 “, సంతోష్ జాగర్ల ముడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న “లక్ష్య “, రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్ ” మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. జూలై 12 వతేదీ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న “#RAPO 19 “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న “ఏజెంట్ “మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఈ రోజు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న “#NS22 ” మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: