‘పచ్చీస్’ రివ్యూ.. ..ఆద్యంతం సస్పెన్స్

Pachchis Movie Review A Perfect Thriller Packed With Suspense Elements All Through out,Pachchis Telugu Movie Review,Pachchis Movie Review,Pachchis Review,Pachchis,Pachchis Movie,Pachchis Telugu Movie,Pachchis Movie Updates,Pachchis Update,Pachchis Telugu Movie Updates,Pachchis Telugu Movie Latest News,Pachchis Movie Latest News,Pachchis Film Updates,Pachchis Telugu Movie Live Updates,Pachchis Movie Live Updates,Pachchis Movie Story,Pachchis Movie Breaking News,Pachchis 2021,Latest Telugu Movies Reviews,Pachchis Movie Public Talk,Pachchis Public Talk,Pachchis Movie Public Talk And Public Response,Raamz Pachchis Telugu Movie Review,Raamz,Pachchis Telugu Movie Review And Rating,Pachchis Movie Rating,Pachchis Movie Rating,Pachchis Movie Release Updates,Pachchis Review And Rating,Latest News On Pachchis,Latest Telugu Movie Reviews 2021,Raamz,Swetaa Varma,Smaran,Sri Krishna,Rama Sai,Kaushik Kumar Kathuri,Rama Sai,Pachchis Movie Details,Pachchis Movie Review And Rating,Telugu Filmnagar

ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ ప‌తాకాల‌పై కౌశిక్ కుమార్ క‌త్తూరి, రామ‌సాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ప‌చ్చీస్’‌. ఆద్యంతం ఉత్కంఠ‌త‌ను రేకెత్తించే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ‌కృష్ణ‌, రామ‌సాయి సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతుండగా.. శ్వేతా వ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక నేడు ఈసినిమా అమెజాన్ లో రిలీజ్ అయింది. మరి అనుకున్న అంచనాలను ఈసినిమా రీచ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..రామ్స్ , శ్వేతా వర్మ, రవివర్మ, దయానంద్ రెడ్డి, సుభలేఖ సుధాకర్, విశ్వేందర్ రెడ్డి
డైరెక్టర్స్.. శ్రీ కృష్ణ & రామ్ సాయి
ప్రొడ్యూసర్స్.. కౌశిక్ కుమార్ రామ్ సాయి
సినిమాటోగ్రఫి.. కార్తీక్ పర్మర్
సంగీతం.. స్మరణ్ సాయి

కథ..

రాజకీయ నాయకులైన బసవరాజు(కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి)- గంగాధర్(శుభలేఖ సుధాకర్) మధ్య ఆధిపత్య నడుస్తుంటుంది. ఇక అభిరామ్ (రామ్‌) క్ల‌బుల్లో పేకాట ఆడి లక్ష‌ల్లో డబ్బులు పోగొట్టుకుంటాడు. క్ల‌బ్ య‌జ‌మాని ఆర్కే (ర‌వివ‌ర్మ‌)కు రూ.17 ల‌క్ష‌లు బాకీ ప‌డిపోతాడు. దీంతో తన అప్పులు చెల్లిండటంకోసం బసవరాజు – గంగాధర్ మధ్య జరుగుతున్న వార్ లోకి ఎంటర్ అవుతాడు. మరోవైపు గంగాధ‌ర్ గ్యాంగ్‌లో ఉంటూనే ఓ వ్య‌క్తి అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ చేస్తుంటాడు. అత‌నెవ‌రో తెలుసుకోవ‌డానికి గంగాధ‌ర్ గ్యాంగ్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇంతకీ ఆ అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్ ఎవ‌రు అనేది మ‌రో క‌థ‌. ఈ అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్ క‌థ‌కీ, అభిరామ్ కీ లింకేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ

ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే కొత్త దర్శకులు ఎక్కువగా ఈ జానర్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఇక శ్రీ కృష్ణ, రమా సాయి మొదటి సినిమాతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ అలాగే అనిపించినా మన దేశంలో పాతుకుపోయిన పొలిటికల్ లీడర్స్ అక్రమాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో చాలా వరకూ తర్వాత ఏం జరగబోతోంది అనే అంశం మీద ప్రేక్షకుడికి ఒక అవగాహన వస్తుంది. కానీ ఈ సినిమాలో అలా ప్రేక్షకుడి అంచనాలకు అందకుండా దర్శకులు డీల్ చేసిన విధానం బాగుంది. తొలి స‌న్నివేశం నుంచే.. క‌థ చెప్ప‌డం ప్రారంభించారు. కేవ‌లం క‌థ మాత్ర‌మే తెర‌పై న‌డుస్తుంది.

నిజానికి ఈ సినిమాపై అంత ఇంట్రెస్ట్ కలగడానికి ప్రధాన కారణం రామ్స్ అని చెప్పొచ్చు.. ఎందుకంటే టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసారు. ఈసినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాకుమంచి బజ్ క్రియేట్అయింది. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ అవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.రామ్ కి ఇదే తొలి సినిమా. ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. జూద‌రిగా త‌న పాత్ర‌లో ఇమిడిపోయాడు. పాత్రను ఎమోష‌న్స్ లేని పాత్రను క్రియేట్ చేశారు. డ‌బ్బు త‌ప్ప‌.. ఏ ఎమోష‌న్లూ త‌న‌కు అక్క‌ర్లేద‌నుకునే పాత్ర‌కి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఈసినిమాలో ర‌వివ‌ర్మ వేరుగా క‌నిపించాడు. ఆర్కేగా.. త‌న న‌ట‌న అత్యంత స‌హ‌జంగా అనిపించింది. త‌న అన్న‌య్య ఆచూకీ కోసం.. గాలించే యువ‌తి పాత్ర‌లో శ్వేత వ‌ర్మ క‌నిపించింది. ఈ సినిమాలో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్ తనదే. ద‌ర్శ‌కుడు ఏ పాత్ర‌కు ఎవ‌రిని తీసుకున్నా.. అంతా వారి వారి పాత్ర‌ల్లో అచ్చుగుద్దిన‌ట్టు దిగిపోయారు. ఆ క్రెడిట్ మాత్రం ద‌ర్శ‌కుడికీ ద‌క్కుతుంది.

ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఈసినిమాకు సినిమాటోగ్రఫి ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది.
ఆ విషయంలో కార్తీక్ పర్మర్ పనితనం కనిపించింది. ఇక పాటలు ఏమీ లేకపోయినా స్మరణ్ సాయి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కరోనా సమయంలో ఈసినిమా మంచి టైం పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − nineteen =