తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలే ఇస్తున్నారు తెలుగు దర్శకులు. క్రాక్ సినిమా జయమ్మ పాత్రలో వరలక్ష్మీ నటన అందరినీ ఆకట్టుకుంది. దాంతో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ-గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీ నిర్మిస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా..ఇప్పుడు వరలక్ష్మి శరత్ కూడా మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రాక్ సినిమాలో గోపించద్ మలినేని వరలక్ష్మీ కి ఎలాగైతే పవర్ ఫుల్ రోల్ రాశాడో ఈసినిమా కోసం కూడా పవర్ ఫుల్ రోల్ రాసినట్టు తెలుస్తుంది.
ఇక క్రాక్ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించాడు గోపిచంద్. ఇక ఈసినిమాను కూడా రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కించబోతున్నాడు. అంతేకాదు ఈసినిమా కోసం లైబ్రరీలో పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు గోపించద్. మరి ఈసినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: