ప్రతీరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ ఈసినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత వరకూ పూర్తవ్వగా.. పరిస్థితులు కాస్త నెమ్మదిస్తే జూలై నుండి ను కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇక రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing our Macho & Dynamic Hero @YoursGopichand a very happy birthday! #HBDGopiChand 🎉
Here’s the birthday special poster of #Gopichand from @DirectorMaruthi‘s #PakkaCommercial 🤩@RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/AhR0yhumGF
— UV Creations (@UV_Creations) June 11, 2021
కాగా జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా నటిస్తుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: