కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే సందేశాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో పలు దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో సారి అదే జోనర్ తో వచ్చేస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా నుండి టీజర్ కూడా వచ్చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా టీజర్ టైంను ఫిక్స్ చేశారు. జూన్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. తమిళ్ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక 30 సంవత్సరాల క్రిందట జూన్ 4వ తేదీ న మోహన్‌బాబు హీరోగా రూపొందిన “అసెంబ్లీరౌడీ” చిత్రం విడుదలై అనేక సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆరోజున టీజర్ విడుదల చేయనున్నారు.
“Dialogue King” @themohanbabu ‘In & As’ #SonofIndia🇮🇳
All set for the #SonofIndiaTeaser Launch by Nadippin Nayagan @Suriya_offl on 4th-June at 12:20PM🎶 Maestro #Ilaiyaraaja Musical🎵
Written and Directed by @ratnababuwriter @24framesfactory #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/MBJPIq6ex5— 24 Frames Factory (@24FramesFactory) June 3, 2021
కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: