ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్‘ సినిమా చేస్తున్నాడు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా విశ్వక్ సేన్ లిస్ట్ లో ఉన్నాయి. అశ్వథ్ మరిముత్తు దర్శకత్వంలో ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్నాడు. దానితో పాటు విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ మరో సినిమా చేస్తున్నాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
వీటితో పాటు కె.ఎల్ విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ లో మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 31-లేడీస్ నైట్ అనే వెరైటీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో విశ్వక్ సేన్ నలుగురు హీరోయిన్స్ తో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజిమా మోహన్, రెబ్బా జాన్ లతో విశ్వక్ సేన్ నటించనున్నాడట. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా కీలక పాత్రలో నటించనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నారట చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: