యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా తన సినిమాల నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 నుండి స్పెషల్ పోస్టర్ ను.. అలాగే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న 18 పేజీస్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా 18 పేజీస్ నుండి నిఖిల్ కు సంబంధించి సోలో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పోస్టర్ కూడా చాలా వినూత్నంగా ఉంది. నిఖిల్ ముఖంపై గూగుల్ సెర్చ్ బార్ తో పాటు పల్ యాప్స్ కు సంబంధించిన లోగోస్ కూడా ఉన్నాయి. దీన్నిబట్టి ఈసినిమాలో నిఖిల్ టెక్నాలజీకి బాగా దగ్గర ఉండే వ్యక్తి అనిపిస్తుంది.
Here we go! Presenting the most captivating & intriguing look of @actor_Nikhil from #18Pages 🔥📑#HappyBirthdayNikhil 🥳#AlluAravind @aryasukku #BunnyVas @anupamahere @dirsuryapratap @GopiSundarOffl @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/yxxmRlrJmc
— Geetha Arts (@GeethaArts) June 1, 2021
ఇక నిఖిల్ కూడా చాలా కాలంగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈరెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరో విషయం ఏంటంటే.. ఈరెండు సినిమాల్లో కూడా నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరనే నటిస్తుంది.ఇక ’18 పేజీస్’ ఫస్ట్ లుక్ బట్టి చూస్తే సుకుమార్ నుంచి మరో వైవిధ్యమైన కథాంశం వస్తున్నట్లు అర్థం అవుతోంది. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రస్ట్ కలిగించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ తో దాన్ని రెట్టింపు చేసారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా కార్తికేయ2 ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: