పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు రైటర్ గా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ గా కొనసాగుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో నాగార్జున హీరోగా రూపొందిన “రాజన్న “మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పిన “బాహుబలి “మూవీ కి కథ ను అందించిన ఘనత విజయేంద్ర ప్రసాద్ దే. సల్మాన్ ఖాన్ “భజరంగి భాయి జాన్ “, కంగనా రనౌత్ “మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ “బాలీవుడ్ మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు. “తలైవి “(తమిళ ),”రౌద్రం రణం రుధిరం ” మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలు అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదనీ, ఆయన నటించిన సినిమాల్లో నుంచే అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుందనీ , పవన్ ను చూడ డానికే ప్రేక్షకులు సినిమాలకు వస్తారనీ , హీరోయిన్స్ తో సాంగ్స్ , ఫైట్స్ , ప్రజలకు మంచి చేయడం వంటివి కొన్ని సినిమాలో ఉంటే సరిపోతుందనీ, ఆయన సినిమాకు కథ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనీ , పవన్ సినిమా కోసం కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనీ , డైనమైట్ పేలడానికి చిన్న అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందనీ , పవన్ పెద్ద డైనమైట్ అనీ ఒక టీవీ షో లో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: