యంగ్ హీరో సందీప్ కిషన్ మాములు స్పీడ్ లో లేడు.. సినిమాల రిలీజ్ లు.. హిట్ లను పక్కన పెడితే గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఏ1 ఎక్స్ ప్రెస్ తో బోణీ మొదలుపెట్టిన సందీప్ కిషన్ లిస్ట్ లో మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘గల్లీ రౌడీ’. ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు వీడియోలను బట్టి అర్ధమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A “Vi Anand” SuperNatural Fantasy..
A @HasyaMovies @RajeshDanda_ Production ❤️#SK28 pic.twitter.com/otloTU3CiE— Sundeep Kishan (@sundeepkishan) May 7, 2021
ఇక ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించేశాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ రోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘టైగర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల తరువాత మళ్లీ కలిసి చేస్తున్నారు. సూపర్ న్యాచురల్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాను హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. బాలాజీ గుట్ట సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుపెట్టనుండగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారట. మరి కొత్త కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: