17 ఏళ్ల ఆర్య.. నా జీవితంలో పెద్ద మిరాకిల్

Icon Staar Allu Arjun Attributes All His Success To Arya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun,Stylish Star Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Icon Staar Allu Arjun,17 Years Of Arya Today,17 Years Ago,On This Day,Icon Staar Allu Arjun And Director Sukumar's Arya,17 Years For Arya Movie,17 Years For Arya,17 Years Of Arya Movie,17 Years Of Arya,17 Years For Allu Arjun Arya Movie,Allu Arjun Arya Movie Movie Completes 17 Years,Arya Movie 17 Years,Arya Movie SOngs,Arya Songs,Arya Full Movie,Arya Movie,Arya Telugu Full Movie,Arya Telugu Movie,Arya Update,Arya Movie Updates,Arya Movie Latest Updates,Arya Movie Latest News,Aarya Telugu Latest Full Movie,Allu Arjun Celebrates Arya,Feel My Love,Allu Arjun Remembers Arya,Arya Completes 17 Years,Allu Arjun On 17 Years Of Arya,Allu Arjun Pens Heartfelt Notes On Instagram,Dil Raju,Anu Mehta,Devi Sri Prasad,#17YearsForArya

ఆర్య… సుకుమార్‌-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పుడూ ఈసినిమా ప్రెష్ ఫీలింగ్ నే ఇస్తుంది. సుకుమార్ డైరెక్షన్ ,కథ, బన్నీ యాక్టింగ్.. మరోవైపు దేవి మ్యూజిక్ అన్నీ ఈసినిమాకు కలిసొచ్చాయి. 2004లో సినిమా విడుద‌లైన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ‌డ‌మే కాదు.. అల్లు అర్జున్‌, సుకుమార్‌లను స్టార్స్‌గా మార్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమాలో బన్నీ చెప్పే ఫీల్ మై లవ్ అనే పదాలకు అప్పట్లో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచింది. ఇక అను మెహతా హీరోయిన్ గా నటించగా.. శివ బాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా విడుద‌లై నేటికి స‌రిగ్గా 17 ఏళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా మరోసారి ఆర్యను గుర్తుచేసుకున్నారు. ఆర్య సినిమా విడుద‌లై ఈరోజుతో 17 ఏళ్ల‌వుతుంది. నా లైఫ్ చేంజింగ్ విష‌యాల్లో ఈ సినిమా కూడా ఒక‌టి. నా జీవితంలో జ‌రిగిన ఓ గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్ అనే గోల్డెన్ వర్స్డ్ నేను చెప్పిన తర్వాత ప్రేక్ష‌కులు నాపై ప్రేమ‌ను కురిపించారు’’ అని బన్నీ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇక ఆతర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య 2 సినిమా కూడా వచ్చింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సుక్కూ-బన్నీ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో, డిఫరెంట్ గెటప్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. అది సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఆగష్ట్ 13 న ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 11 =