గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇటీవల గౌతమ్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. గౌతమ్ రామ్ చరణ్ కు కథ వినిపించాడని.. చరణ్ కు కూడా కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడన్న కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న గౌతమ్ ను ఈసినిమా గురించి అడుగగా.. అలాంటిది ఏం లేదని.. ఇంకా స్క్రిప్ట్ వర్కే పూర్తి కాలేదు.. ప్రస్తుతం జెర్సీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ఆసినిమా రిలీజ్ అయితే కానీ నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించలేనని.. ప్రస్తుతం నా మైండ్ లో ఏ హీరో లేరు.. నేను ఎవర్నీ కలవ లేదు.. ఎవరికి కథ వినిపించలేదని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనితో ఈ రూమర్స్ కు బ్రేక్ పడినట్టే.
హిందీ వర్షన్ ను టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. సూపర్ 30, బాట్ల హౌస్ సినిమాల్లో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: