‘వకీల్ సాబ్’ కు ఏపీ హైకోర్టు బంపర్ ఆఫర్

Vakeel Saab Movie Gets Clearance From AP High Court For Ticket Price Hike,Big Relief To Vakeel Saab In HC,Vakeel Saab Ticket Price Hike Allowed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Film Update,Vakeel Saab Movie News,Pawan Kalyan’s Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Update,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Gets Clearance From AP High Court,AP High Court,Vakeel Saab Ticket Price Hike Allowed,Vakeel Saab Gets A Relief From AP High Court,Vakeel Saab Ticket Price Hike Allowed From AP High Court,Vakeel Saab Ticket Price Hike,Vakeel Saab Movie Latest News,#VakeelSaab

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు మూడేళ్లు వెయుట్ చేసిన పవన్ ఫ్యాన్స్ కు ఈసినిమా ఫుల్ మీల్స్ లాగ దొరికింది. సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు ఉన్నాయో.. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఈసినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎక్కడ చూసినా థియేటర్లు హౌస్ ఫుల్ తో కళకళలాడిపోతున్నాయి. పవన్ సినిమా ఈరేంజ్ లో ఉంటుందని మరోసారి చూపించారు ఫ్యాన్స్ కూడా.

దీనికి తోడు ఏపీ ప్రభుత్వం కూడా వకీల్ సాబ్ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. రిలీజ్ కు ముందు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు వకీల్ సాబ్ టీమ్ ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. థియేటర్స్ లో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. టికెట్ ధరలు పెంచడానికి వీలు లేదంటూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఈ విషయంపై ఏపీ హైకోర్టు‌ను సంప్రదించగా.. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి పవన్ రీఎంట్రీ మాత్రం చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టింది. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. మరి ఈసినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here