‘లైగర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్

Liger Movie Team Starts Post Production Work,Telugu Filmnagar,Telugu Film News 2021,Puri Jagannath Kick Starts Liger’s Post Production,Puri Jagannath,Director Puri Jagannath,Puri Jagannath New Movie,Puri Jagannath Latest Movie,Puri Jagannath Liger,Liger Post Production Work,Liger Post Production Work Started,Puri Jagannadh And Vijay Deverakonda’s Upcoming Movie,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Liger,Vijay Deverakonda Liger Movie Post Production Work Starts,Liger Movie Post Production Work Starts,Liger Team Kick Starts Post Production Work,Puri Jagannath Kick Started Liger’s Post Production Formalities,Ananya Panday,Liger Movie,Liger,Liger Telugu Movie,Liger Update,Liger Movie Latest Update,Liger Movie News,Vijay Deverakonda New Movie

పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ మూవీకి మరోసారి బ్రేక్ పడింది. ఈసినిమా షూటింగ్ కు గత ఏడాది కరోనా వల్ల ప్యాకప్ చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెళ్లిన కొద్దిరోజులకే మళ్లీ ఇక్కడికి వచ్చేశారు.

ఇక ఈగ్యాప్ లో పూరీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు. మళ్లీ ఎప్పుడు వెళతారో తెలియదు కాబట్టి ఇప్పటి వరకూ జరిగినంత వరకూ ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగూ ఖాళీయే కాబట్టి ఈ టైమ్ ను వాడుకుంటే.. తరువాత షూటింగ్ మొదలుపెట్టినప్పుడు మిగిలిన పనులు అప్పుడు చూసుకోవచ్చని.. అలా అయితేనే అనుకున్నటైమ్ కు సినిమా రిలీజ్ చేయగలమని చిత్రయూనిట్ భావిస్తున్నారట.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

కాగా గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ పూర్వవైభవం వస్తుంది కదా అని అనుకునేలోపే మళ్లీ సెకండ్ వేవ్ అంటూ వచ్చిపడింది. మళ్లీ సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది… సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. ఇక ఇక్కడ పరిస్థితి కాస్త ఓకే గా ఉన్నా… ముంబైలో అయితే దీని ప్రభావం ఎక్కవగానే ఉంది. అక్కడ థియేటర్లు కూడా మూసేశారు. మరి మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేవరకూ సినీ పరిశ్రమకు దెబ్బలు తప్పవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here