సూపర్ హిట్ “RX 100 “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని కార్తికేయ క్రేజీ హీరోగా మారారు. “హిప్పీ “, “గుణ 369 “, “90 ML “మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. విలన్ పాత్రలంటే ఆసక్తి ఉన్న కార్తికేయ , నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ “మూవీ లో నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా రూపొందుతున్న “వాలిమై “తమిళ మూవీ లో కార్తికేయ ప్రతినాయకుడిగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టి ఆదిరెడ్డి సమర్పణ లో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై రామా రెడ్డి నిర్మాతగా నూతన దర్శకుడు శ్రీ సారిపల్లి దర్శకత్వం లో కార్తికేయ హీరోగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కార్తికేయ నటిస్తున్న ఈ మూవీ లో తాన్యా రవిచంద్రన్ కథానాయిక. షూటింగ్ ప్రారంభం అయిన విషయాన్ని చిత్ర యూనిట్ ఆ మూవీ ఫస్ట్ అప్ డేట్ గా ఒక వీడియో ను రిలీజ్ చేసింది. ఈ మూవీ తో హీరో కార్తికేయ సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: