శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వంలో రామ్స్, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్’. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించాడు.
The edge of the seat Nail biting thriller #PachchisTeaser launched by @TheDeverakonda is out now! 🔥
▶️ https://t.co/H69ubY9acj#PachchisMovie #Pachchis@raamzofficial @AvasaChitram @raastafilms @krishchad @csaikumarr @dineshyadavb @SwetaaVarma@kaushikkathuri @MangoMusicLabel pic.twitter.com/DEu2yKFkuR
— Telugu FilmNagar (@telugufilmnagar) March 18, 2021
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను అవసా చిత్రం, రాస్తా ఫిలింస్ బ్యానర్లపై కౌశిక్ కుమార్ కత్తూరి, రమా సాయి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: