‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా. అప్పటి వరకూ ఒకే ధోరణిలో ఉన్న సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకోండి. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. ఇక కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా రెడీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం సందీప్ రెడ్డి హిందీలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో సందీప్ తో మహేష్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పటివరకూ సినిమా పై ఎలాంటి క్లారిటీ లేదులే కానీ… రీసెంట్ గా ఒక యాడ్ ను మాత్రం డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది సందీప్ కు. మహేష్-తమన్నా ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొనగా సందీప్ డైరెక్ట్ చేశాడు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇద్దరి కాంబనేషన్ లో సినిమా వస్తే బావుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సందీప్ కూడా దీనిపై స్పందించి.. మహేష్ సినిమాతో అయితే పక్కాాగా ఉంటుంది.. అయితే అది ఎప్పుడు ఉంటుందో అని మాత్రం అప్పుడే చెప్పలేను అని చెప్పాడు.
మరి ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తరువాత రాజమౌళి తోసినిమా అంటున్నారు మరి. ఆ తర్వాత ఏమైనా సందీప్ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: