దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ రూపొందుతుంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“BB3″మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఏకర్స్ లో స్పెషల్ గా రూపొందించిన టెంపుల్ సెట్ లో జరుగుతుంది. ఈ టెంపుల్ సెట్ లో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తరువాత షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు కర్ణాటక లోని బెల్గాం లో ప్లాన్ చేశారు.“BB3″మూవీ కథానాయిక ప్రగ్య జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ .. హీరో బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించారు. బాలయ్య తో స్క్రీన్ షేర్ కొనడం అద్భుతమైన అనుభవం అనీ , బాలకృష్ణ ఎనర్జీ కే పవర్ హౌస్ వంటివారనీ , ఆయనతోసెట్ లో ఉన్నంత సేపూ ఎంతో పాజిటివ్ గా అనిపిస్తుందనీ కామెంట్స్ చేసారు.తమ అభిమాన హీరో పై ప్రగ్య కామెంట్స్ నందమూరి అభిమానులను ఫిదా చేసాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: