శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి కొద్దిరోజులు హైదరాబాద్ లో కూడా షూటింగ్ జరిపారు. అయితే అదే సమయంలో చిత్ర యూనిట్ లో కరోనా కలకలంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. ఆ తర్వాత రజినీకాంత్‌కి ఆరోగ్య సమస్య తలెత్తడంతో.. చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటి వరకూ షూటింగ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు నటిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంతకు ముందు జగపతి బాబు ‘కథానాయకుడు’, ‘లింగా’ చిత్రాలలో రజినీతో కలిసి చేశారు.
.@IamJagguBhai joins the cast of #Annaatthe.@rajinikanth @directorsiva @immancomposer #Nayanthara @KeerthyOfficial pic.twitter.com/k9ZHVLUNNx
— Sun Pictures (@sunpictures) March 16, 2021
కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: