మన తెలుగు సినిమాల కోసం బాలీవుడ్ నుండి నటీనటులను ఎప్పటినుండో అద్దెకు తెచ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు కూడా బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా.. విజయ్ దేవరకొండ, రానా, సందీప్ కిషన్, అడివి శేష్, నవీన్ పోలిశెట్టి, సత్యదేవ్ వీళ్ళంతా కూడా హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా ఇదే బాటలో వెళుతున్నట్టు తెలుస్తుంది. ఆహీరో ఎవరో కాదు నాగ చైతన్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో. ఈసినిమాలో ఒక కీలకపాత్రలో నాగచైతన్య నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నా, ఇప్పుడు ఇది నిజమనే నిర్థారణకు వచ్చారు. మే నెలలో ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ లో చైతు పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. మరి ఇందలో ఎంత నిజముందో తెలియాలంటే చైతు అధికారికంగా ప్రకటించాల్సిందే. అప్పుడే క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ చేసిన సారంగదరియా సాంగ్ ఎన్ని వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: