కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున

Actor Nagarjuna Akkineni Takes Covid Vaccine Today At A Private Hospital,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Nagarjuna Akkineni,Hero Nagarjuna Akkineni,Akkineni Nagarjuna,Akkineni Nagarjuna Latest News,Akkineni Nagarjuna Takes Covid Vaccine Today At A Private Hospital,Akkineni Nagarjuna Takes Covid Vaccine,Covaxin Vaccine,Akkineni Nagarjuna Takes Covaxin Vaccine,COVID 19 Vaccine,Actor Nagarjuna Akkineni Takes Covid-19 Vaccine,Nagarjuna Gets First Dose Of COVID-19 Vaccine,Akkineni Nagarjuna Gets First Dose Of COVID-19 Vaccine,Nagarjuna Akkineni Receives First Dose Of COVID-19 Vaccine,Nagarjuna Takes Coronavirus Vaccination Shot,Nagarjuna Akkineni Gets Covid Vaccine,Akkineni Nagarjuna Taken Covid Vaccine,Akkineni Nagarjuna Covid Vaccine News

2020 కరోనా ప్రభావం ఎలా ఉందో చూశాం. కాస్త ఆమధ్య కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అందరిలో మళ్లీ భయం మొదలైంది. అందుకే ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటున్నారు. ఇక ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి కూడా వచ్చింది. రాజకీయ నాయకులు, సినీ తారలు, సామాన్య ప్రజలందరూ వ్యాక్సినేషన్‌ తీసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కూడా ఫస్ట్‌ డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని, అందుకోసం ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలని ఆయన కోరారు.

ఇక ప్రస్తుతం నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అహిషోర్ సోల్మ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 2వ తేదీన ఈసినిమా థియేటర్ లలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక మరోవైపు బాలీవుడ్ లో నటించిన బ్రహ్మస్త్ర సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఇంకా తెలుగులో ప్రవీణ్ సత్తారు సినిమా చేయనున్నాడు. త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =