శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో అసురన్ రీమేక్ ‘నారప్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సమ్మర్ స్పెషల్‌గా మే 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండివిడుదలైన పోస్టర్లకు, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మహా శివరాత్రి సందర్భంగా ఈసినిమా నుండి మరో లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో వెంకటేష్ యంగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ని బట్టి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుందని అర్ధమవుతుంది.
Meet our young Narappa 🤩
Happy Maha Shivaratri ! #YoungNarappa #HappyMahashivratri@VenkyMama #Priyamani @theVcreations #SrikanthAddala #Narappa pic.twitter.com/3ABNsoDH8k— Suresh Productions (@SureshProdns) March 11, 2021
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం కీలక పాత్రలో నటిస్తున్నాడు. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: