అఫీషియల్.. ప్రేమలు సీక్వెల్ వచ్చేస్తోంది

Premalu Sequel Confirmed by Makers

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’. నస్లెన్ కే గఫూర్, మమితా బైజు నటించగా.. చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులోనూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 17కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. తెలుగులో ఈ సినిమాను గ్లోబల్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ సమర్పించిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళంలో సైతం మంచి వసూళ్లు రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో తాజాగా ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు విషయాన్ని ఎస్‌ఎస్‌ కార్తీకేయ శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 19) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే ఈ సీక్వెల్‌ 2025లోనే రిలీజ్‌ అవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్ద కథేమీ లేకపోయినప్పటికీ యువతను ప్రేమలు బాగా ఆకట్టుకోవడం విశేషం. క్యూట్ లవ్‌ స్టోరీ, యూత్‌కు కనెక్ట్‌ అయ్యే డైలాగ్స్‌ ఉండటం, ఇంకా హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కడం వంటి అంశాలు ఈ సినిమాకు కలిసొచ్చాయి.

కాగా ప్రస్తుతం ప్రేమలు తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుండగా.. డిస్నీ+హాట్‌స్టార్‌లో మల‌యాళం, త‌మిళ, హిందీ భాష‌ల‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో మ‌ల‌యాళ స్టార్ యాక్టర్, ‘పుష్ప’ ఫేమ్ ఫహద్ ఫాజిల్ భాగస్వామి కావడం విశేషం. గిరీష్ ఏడీ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =