డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాలనుకున్నారు.. ఆ మేరకు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. అయితే ఇంకా పనులు ఉండటంతో రిలీజ్ డేట్ ను మారుస్తూ మరోసారి ప్రకటించారు. మార్చి 5వ తేదీన రిలీజ్ అవుతున్నట్టు ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు సందీప్ కిషన్ కూడా తన ట్విట్టర్ ద్వారా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాకీ నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా.. ఈ సినిమాతో 14 మంది కొత్త టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు.. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ సినిమా మార్చి 5 న రిలీజ్ అవుతుంది.. అంటూ ట్వీట్ చేశాడు.
TFI ‘s 1st Hockey Film & the Debut of 14 young technicians …❤️
Presenting to you my most confident film to date #A1Express on 5th March
Experience the Madness on the Big Screen 🔥
#Dennis @Itslavanya @hiphoptamizha @Kavin_raj15 @AAArtsOfficial @peoplemediafcy @TalkiesV pic.twitter.com/RLpJlPKDX9
— A1 Express on 5th March (@sundeepkishan) February 21, 2021
కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. మరి సందీప్ కిషన్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది.. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం..
ఇక ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ హీరోగా “రౌడీ బేబీ” అనే సినిమా చేస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా ను ఎంవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్‌లో వస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.