ఈవారం సందడి చేయనున్న సినిమాలు

Here Are The Movie Releases For This Week,List Of Movies Releasing This Week,Movie Releases On 26th February,Movie Releases In This Week,Movies List,Check,Check Movie,Check Movie Release,Check Telugu Movie,Check Movie Release,Check Movie Telugu,Telugu Movie Releases In This Week,Tollywood Movie Releases In This Week,List Of Tollywood Movies Releasing This Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,2021 Latest Telugu Movies,Latest Tollywood Movies 2021,List Of Movie Releases For This Week,Akshara Movie,Akshara,Akshara Telugu Movie,Akshara Movie Release,Movie Releases List,Check On Feb 26th,Akshara On Feb 26th,Nithiin Check,Nandita Swetha Akshara,Upcoming Movies 2021,List of Movies Releasing This Friday,Movie Releases For This Week

ఈ ఫిబ్రవరి నెల సినిమాల సందడితోనే ముగిసిపోనుంది. నిజానికి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ లు పెద్దగా పెట్టుకొనేవారు కాదు దర్శకనిర్మాతలు. వస్తే వాలెంటైన్స్ డే కి ఒకటో రెండో సినిమాలు వచ్చేవి. సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్లో సినిమాల సందడి మొదలవుతుంది. కానీ గత ఏడాది కరోనా వల్ల థియేటర్స్ లేకపోవడంతో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. ఇక థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వీలైనంత త్వరగా రిలీజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం వరుస రిలీజ్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడిగా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా ఉప్పెన ఫిబ్రవరి 12 రిలీజ్ అవ్వగా అది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో చూసాం. ఇక ఫిబ్రవరి 19న అల్లరి నరేష్ నాంది సినిమా , ధృవ సర్జ పొగరు, విశాల్ చక్ర, సుమంత్ కపటధారి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నాంది సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఫిబ్రవరి 26 మరో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వారిలో నితిన్ చెక్.. నందితా శ్వేత అక్షర.

ఈ సినిమాలు కూడా వేటికవే విభిన్నమైన కథలే. చంద్రశేఖర్ యేలేటి, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న చెక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటిసారి నితిన్ ఇలాంటి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మరోవైపు నందిత శ్వేత అక్షర కూడా ఒక కీలకమైన పాయింట్ తో తెరకెక్కించారు. విద్యావ్యవస్థలో లోపాలను.. జరిగే అక్రమాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రయిలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ శుక్రవారం వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 14 =