ప్రభాస్ ‘ఆదిపురుష్’ వల్ల నాకు అదే లాభం

Prabhas Will Help His Movie Reaching out To Wider Range Of Audience Says Director Nag Ashwin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Adipurush,Adipurush Movie,Adipurush Film,Adipurush Telugu Movie,Actor Prabhas,Prabhas Adipurush,Adipurush Movie Update,Adipurush Movie Latest News,Nag Ashwin,Director Nag Ashwin,Nag Ashwin Latest News,Nag Ashwin About Prabhas,Nag Ashwin About His Upcoming Movie,Prabhas21,Prabhas21 Movie,Nag Ashwin About Prabhas21,Nag Ashwin About Prabhas 21 Movie,Prabhas 21 Movie News,Adipurush Will Help My Film With Prabhas Reach A Wider Audience Says Nag Ashwin,Adipurush Will Help My Film With Prabhas Syas Nag Ashwin,#Prabhas21

బాహుబలి సిరీస్, సాహూ సినిమాలకు చాలా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం అస్సలు గ్యాప్ లేకుండా షూటింగ్ లు చేసేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఒక సినిమా మినహాయించి మూడు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లలో పాల్గొంటున్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ ఎలాగూ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లోనూ.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అది పురుష్’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే వీటి మధ్యలో ఉన్న మరో సినిమా నాగ్ అశ్విన్ తో సినిమా. నాగ్ అశ్విన్ తర్వాత ప్రకటించిన రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లాయి షూటింగ్ కూడా జరుపుకుంటున్నాయి. ఇక దీనిపై రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. నిజానికి ఆదిపురుష్ సినిమా తర్వాత నా సినిమా చేయడం నాకే ఉపయోగం.. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ రామునిపాత్రలో నటిస్తున్నాడు..ఒక రకంగా ఈ సినిమా దేశంలోని ప్రతి మూలకి చేరుకునే సినిమా.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ ఇంకా పెరుగుతుంది.. అప్పుడు నాకు ఇంకా మంచి ఆపర్చునిటీ దొరికినట్టవుతుంది అని చెప్పాడు. అయితే సినిమా షూటింగ్ కు లేట్ అవ్వడానికి అది కారణం కాదు.. ముందు మార్చి నుండి షూటింగ్ ను చేయాలని అనుకున్నాం.. కానీ కరోనా వల్ల అది కుదర్లేదు.. ఇక ఇప్పుడు అతనికున్న కమిట్మెంట్స్ వల్ల లేట్ అయింది.. జూన్ లేదా జులై నుండి ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు.

ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.