తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి నిర్మించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొద్దికాలంగా చాలా తక్కువ సినిమాల్లో కినిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ ఆకాశం నీ హద్దురా..!’ సినిమాలో భక్త వత్సల నాయుడు అనే కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు దేశభక్తి నేపథ్యంలో వస్తున్న ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాతో పూర్తి స్థాయి పాత్రతో వస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మూడు రంగుల జెండా లో మోహన్ బాబు సీరియస్ లుక్ లో ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు సినిమాలో దేశభక్తికి సంబంధించి ఏదో కీలక పాయింట్ చూపించబోతున్నారన్న విషయం అర్ధమవుతుంది.
Patriotism is in his blood, Meet #SonOfIndia🇮🇳.
Here’s #SonOfIndiaFirstlookDirected by @ratnababuwriter
🎶 Maestro #Ilaiyaraaja Musical@iVishnuManchu @LakshmiManchu @HeroManoj1 @vinimanchu @itsmepragya @24framesfactory#SOI #SreeLakshmiPrasannaPictures pic.twitter.com/5fgFrPBpAb— Mohan Babu M (@themohanbabu) January 29, 2021
కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు. మరి మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం వంటి దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు మరోసారి దేశభక్తి నేపథ్యంలో సినిమాతో రాబోతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా కల్లెక్షన్ కింగ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: