రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ‘థ్యాంక్ యు బ్రదర్’ టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్టరీ వెంకటేష్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి అభి పాత్రలో అశ్విన్.. ప్రియ అనే పాత్రలో అనసూయ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీరిద్దరూ అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు.. లిఫ్ట్‌లో చిక్కుకుపోయినప్పుడు ఆమెకు పురుటి నొప్పులు వస్తుంటే ఆమెను ఎలా కాపాడాడు అన్నది కథ అని అర్ధమవుతుంది. వీటితో పాటు నిన్ను కనేటప్పడు పడ్డ పురిటినొప్పులు ఇప్పటికీ పడుతూనే ఉన్నాను” అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది.
#ThankYou Venky Sir!! Here it is!! #ThankYouBrotherTrailer #OutNow #ThankYouBrother #TYB https://t.co/7T1tbCwvRQ
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 28, 2021
కాగా జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్ నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: