దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా రిలీజ్ కూడా ప్రకటించాడు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. భారీ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ భామ కూడా ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొంది. ఇదిలా ఉండగా నేడు ఒలివియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. జెన్నీఫర్‌గా ఒలివియా నటించబోతుంది.
Presenting @OliviaMorris891 as #Jennifer…:) #RRRMovie #RRR pic.twitter.com/vwvylY7ilc
— rajamouli ss (@ssrajamouli) January 29, 2021
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: