ప్రియమైన స్నేహితుడికి హ్యాపీ బర్త్ డే

Megastar Chiranjeevi Sends Out His Birthday Wishes To Thalaivar Rajinikanth On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi Wishes Thalaivar Rajinikanth On His 70th Birthday,Chiranjeevi pens heartfelt note on Rajinikanth's birthday wishes him luck in politics,Chiranjeevi Wishes Dearest Friend Rajinikanth All The Success In His Political Journey On His 70th Birthday,Megastar Chiranjeevi Wishes Dearest Friend Rajinikanth All The Success In His Political Journey On His 70th Birthday

తమిళ్, తెలుగు, హిందీ ఒక్క భాష కాదు.. ఒక్క దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న హీరో ఎవరైనా వున్నారంటే అది రజినీ కాంత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు బాలచందర్‌ పరిచయం చేసిన ఎంతో మంది గొప్ప నటుల్లో రజినీ ఒకరు. కె. బాల చందర్‌ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్‌. మొదటి సినిమాతోనే అందరికీ రిజిస్టర్ అయిపోయాడు రజినీ. ఆ తర్వాత తన డిఫరెంట్ స్టయిల్ తో.. డిఫరెంట్ మాడ్యులేషన్ తో తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇప్పుడు యావత్ ప్రపంచం గర్వించదగ్గ నటుడయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు రజినీ పుట్టినరోజు. ఈ సందర్భంగా రజినీకి దేశవ్యాప్తంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి కూడా ట్విట్టర్‌ ద్వారా రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించారు. “ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించినట్లే రాజకీయాల్లోనూ విజయం సాధించాలి. ఈ ప్రత్యేకమైన స్టైల్‌తో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రజా సేవలోనూ మీ ప్రత్యేకతను చాటుకుంటారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక ఈ ఏడాది ‘దర్బార్’ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. ప్రస్తుతం తను అజిత్‌తో ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేకం’, ‘విశ్వాసం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ కాంబినేషన్‌లో అన్నాతై సినిమా చేస్తున్నాడు. ఖుష్బూ,మీనా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో…. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.